నందమూరి బాలకృష్ణ ఆఖరుగా భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది చేసింది. ఈ మూవీ విడుదల కంటే ముందే బాలయ్య , బాబి దర్శకత్వంలో సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. కమిట్ అయిన విధంగానే భగవంత్ కేసరి సినిమా పనులు ముగియగానే బాబీ తో మూవీ ని మొదలు పెట్టాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ సినిమాకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 109 వ మూవీగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ ని ఎన్ బి కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫుల్ జోష్ లో జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో బాలయ్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేపథ్యంలో కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ ను ఆపేసి ఎన్నికల పనుల్లో బిజీ అయ్యాడు.

ఇక మే 13 వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు ముగిస్తాయి. దానితో బాలయ్య తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల నాలుగో వారం నుండి ఈ సినిమా షూటింగ్లో బాలయ్య జాయిన్ కాబోతున్నట్లు ఈ సినిమా షూటింగ్లో బాలయ్య జాయిన్ కాగానే ఆయనపై ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి మేకర్స్ ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచినట్లు తెలుస్తోంది. వరస విజాయల తర్వాత బాలయ్య హీరోగా రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nbk