బాలీవుడ్ అందాల నటి సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్, సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తోన్న ఆమెకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.తెలుగులో కరెంట్ తీగ, జిన్నా లతో ఇక్కడి ప్రేక్షకులకు చేరువైన సన్నీ ఈ మధ్యన తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ నటిస్తోంది. ల సంగతి పక్కన పెడితే.. ఇటీవల సన్నీ లియోన్ పుట్టిన రోజు (13) వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. సాధారంగా హీరోయన్లు, నటీమణులకు అభిమానులు ఉంటారు… కానీ పుట్టిన రోజు చేసేంత అభిమానులు అయితే అరుదుగా ఉంటారు. ఆ అరుదైన జాబితాకే చెందుతుంది సన్నీ లియోన్. కర్ణాటకకు చెందిన సన్నీ లియోని అభిమానులు ఆమె పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఓ స్టార్ హీరో బర్త్ డేను జరుపుకొన్నట్లు గానే సన్నీలియోని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అలాగే పేదలకు అన్నదానం నిర్వహించారు. తద్వారా తమ అభిమాన నటి మీద ప్రేమను చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

కర్ణాటకలోని కర్కల్లి గ్రామానికి చెందిన కర్కల్లి బాయ్స్ అనే బృందానికి యువకులు ఇలా ఎంతో గ్రాండ్ గా సన్నీ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదంతా ఎందుకు చేశారో కూడా చెప్పుకొచ్చారు. ' మేం సన్నీ లియోన్ లతో పాటు ఆమె సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా అభిమానులం. ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె చాలామందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆకలి తీర్చింది'.'సన్నీ గతంలో నటించిన లు ఎలా ఉన్నా ఆమెలో మంచి సేవా గుణం ఉంది. మన దేశంపై గౌరవంతో ఇక్కడే నివాస ముంటోంది. మన దేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా తన లైఫ్ స్టైల్ ను మార్చు కుంది. ఇక్కడి జనాలతో కలిసిపోయింది. కష్ట పరిస్థితుల్లో ఎంతో మందికి ఆపన్న హస్తం అందిస్తోంది. ఇంతకంటే ఏం కావాలి' అని కర్కల్లి బాయ్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సన్నీ లియోన్ బర్త్ డే ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: