అల్లు అర్జున్.. ఒకప్పుడు టాలీవుడ్ లో మాత్రమే స్టైలిష్ స్టార్ గా సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడుగా ఉండేవాడు. కానీ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో నటించిన తర్వాత టాలీవుడ్ లో మాత్రమే కాదు ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అంటే తెలియని వారు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గంధపు చుక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప 2 సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.


 ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించింది అన్న విషయం తెలిసిందే. అయితే పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ఈ మూవీకి సీక్వల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమాపై భార్య రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నారు అన్న విషయం తెలిసిందే.  ఈ సినిమా కోసం బన్నీ అభిమానులందరికీ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక పుష్ప 2 నుండి వస్తున్న అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. ఇకపోతే ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీ నుండి ఎడిటర్ ఆంటోనీ రూబెన్ తప్పుకున్నట్లు సమాచారం. ముందస్తు కమిట్మెంట్స్ చాలానే ఉండడంతో ఇక స్నేహపూర్వకంగానే ఈ మూవీ టీం నుంచి బయటికి వచ్చారట. అతని స్థానంలో నవీన్ నూలిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మిగిలి ఉన్న మిగతా వర్క్స్ మొత్తాన్ని కూడా నవీన్  పూర్తి చేయబోతున్నాడట. ధ్రువ, నాన్నకు ప్రేమతో, రోమియో, గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాలకు నవీన్ నూలి ఇప్పటివరకు ఎడిటర్ గా పనిచేశారు. మరి ముందు నుండి ఉన్న ఎడిటర్ తప్పుకోవడం  పుష్ప 2 సినిమాపై ఏమైనా ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: