ఈషా రెబ్బ.. టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందం అభినయంతో  మాత్రం ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తన పాత్ర నటనకు ప్రాధాన్యం ఉన్నది అయితే ఇక చిన్న హీరో పెద్ద హీరో అని చూడకుండా నటించేందుకు సిద్ధమవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇక ఇండస్ట్రీలో ఇప్పటివరకు కొన్ని సినిమాలలో నటించినా అవి పెద్దగా హిట్ కాకపోవడం హిట్ అయిన సినిమాల్లో ఈ హీరోయిన్ పాత్రకు మంచి గుర్తింపు రాకపోవడంతో ఇక స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. అయితే కేవలం మెయిన్ హీరోయిన్ గా మాత్రమే కాదు స్టార్ హీరోల సినిమాల్లో ఇక సెకండ్ హీరోయిన్గా కూడా నటించే అవకాశాలను దక్కించుకుంది అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత లో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తారక్ హీరోగా నటించగా.. పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. ఇక ఇదే మూవీ లో ఈషా రెబ్బ సెకండ్ హీరోయిన్గా నటించగా.. తన అందం అభయంతో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక ఈ అమ్మడి పాత్రనిడివి చాలా తక్కువగా ఉండడంతో.. సినిమాలోని కొన్ని సన్నివేశాలలో ఇలా వచ్చి అలా మెరుపుతీగల వెళ్లిపోయింది తప్ప.. పెద్దగా ఆ పాత్రతో ఈషా రెబ్బకి మాత్రం గుర్తింపు రాలేదు. ఇదే విషయం గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత సినిమాలో తొలుతా నటించేందుకు తాను ఒప్పుకోలేదు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. నాకు ప్రధాన పాత్ర చేయాలని ఉండడంతో నేను సెకండ్ హీరోయిన్ రోల్ కోసం సైన్ చేయలేదు. కానీ నాది కూడా మెయిన్ హీరోయిన్ పాత్రే అంటూ దర్శక నిర్మాతలను ఒప్పించి నాతో సైన్ చేయించారు. కానీ ఆ తర్వాత నేను నటించిన అన్ని సన్నివేశాలు ఎడిటింగ్ లో పోయాయి. కనీసం సెకండ్ లీడ్ గా కూడా నాకు పేరు రాలేదు. అందుకే అరవింద సమేత సినిమా చేసినందుకు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది ఈషా రెబ్బ.

మరింత సమాచారం తెలుసుకోండి: