ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కామెడీ షో ఎంతమందికి లైఫ్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కనీసం మూడు పూటలా తిండి కూడా తినలేని పరిస్థితిలో ఉన్న ఎంతో మందికి అవకాశాన్ని కల్పించింది జబర్దస్త్. తమ టాలెంట్ ఏంటో నిరూపించుకునేందుకు ఒక మంచి వేదికను అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ లోకి వచ్చిన కమెడియన్స్ అందరూ కూడా ఊహించని రీతిలో గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ లో ఉన్నవారు ఇక ఇప్పుడు హీరోలుగా కూడా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇలా ఈ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్సులో గెటప్ శ్రీను కూడా ఒకరు. సుడిగాలి సుదీర్ టీంలో మెయిన్ కమెడియన్ గా కొనసాగిన గెటప్ శ్రీను ప్రతి స్కిట్లో కూడా ఏదో ఒక గెటప్ వేసుకుంటూ ఇక ప్రేక్షకులను నవ్వించేవాడు. ఏ గెటప్ వేసిన ఆ పాత్రకి ప్రాణం పోసి తన నటనతో ఆకట్టుకునేవాడు. ఇక అతనిలోని గొప్ప నటుడుని చూసి అటు బుల్లితెర ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యేవారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు హీరోగా కొన్ని సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఇప్పుడు రాజు యాదవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఒకవైపు హీరోగా చేస్తూ.. ఇంకో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్న గెటప్ శ్రీను.. ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. మళ్ళీ కలుద్దాం అంటూ ఇటీవల గెటప్ శ్రీను పెట్టిన పోస్ట్ కాస్త సంచలనంగా మారిపోయింది. ఇక గెటప్ శ్రీను నిర్ణయంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారట. అయితే అతను ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి అని ఎంతోమంది చర్చించుకుంటున్నారు  ప్రస్తుతం  వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫామ్ లో ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని ఇంకొంతమంది ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: