ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్  త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ అనే గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే  ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. తారక్ సినిమాల గురించి కాదు ఏకంగా తారక్ ఇరుక్కున్న ఒక భూ వివాదం కు సంబంధించిన వార్త గురించి తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.


 స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల హైకోర్టు మెట్లు ఎక్కాడు. ఓ ల్యాండ్ కు సంబంధించిన వివాదాల్లో ఎన్టీఆర్ ఇలా హైకోర్టును ఆశ్రయించారు అన్నది తెలుస్తుంది. 2003లో గీతా లక్ష్మీ అనే ఒక వ్యక్తి నుంచి ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేశాడట తారక్. అయితే గీతాలక్ష్మీ 1996 నుంచి అదే ప్రాపర్టీ మార్టీ గేజ్ ద్వారా లోన్ పొందిందట. అయితే ఈ విషయాన్ని దాచి పెట్టి.. ఇక ఎన్టీఆర్కు ఈ ప్రాపర్టీని అమ్మేసిందట. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మరి.. ఇక ఈ ప్రాపర్టీ పై గీతా లక్ష్మీ మూడు నాలుగు బ్యాంకుల నుంచి ఇక లోన్స్ పొందిందట. అయితే జూనియర్ ఎన్టీఆర్కు ఫ్లాట్ అమ్మే సమయంలో ఆ విషయాన్ని పెట్టడంతో.  కొన్నాళ్ళకి బ్యాంకులు నుంచి ఇక ప్రాపర్టీని సీజ్ చేసేందుకు అధికారులు వచ్చారట. ఈ క్రమంలోనే ఇక జరిగిన మోసంపై 2019లోనే బ్యాంక్ అధికారులు సహా తనకు ప్రాపర్టీ అమ్మిన గీతా లక్ష్మీపై కేసు పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా హైకోర్టు నుంచి డిఆర్టి రావడంతో ఎన్టీఆర్ కోర్టు మెట్లు ఎక్కారు అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసి ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే తారక్ సినిమాలకు విషానికి వస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 లో కూడా నటిస్తున్నాడు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: