సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో స్టార్ హీరోలు ఎప్పుడు ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఎక్కడ షూటింగ్ జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే ఈరోజు ఇండియాలో ఉంటే రేపు మరో దేశంలో ఉండడం చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో విదేశాల్లో మారుమూలన ఇక చాలా రోజులపాటు షూటింగ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పాలి.


 అందుకే షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరికింది అంటే చాలు హీరోలు ఇక ఫ్యామిలీతో సమయాన్ని గడిపేందుకు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపే హీరోలలో మహేష్ బాబు ముందు ఉంటారు. ఇక షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేక్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లడం చేస్తూ ఉంటారు. ఇక ప్రతి ఏడాదికి దాదాపు 6 నుంచి ఏడుసార్లు పైగానే ఇలా మహేష్ బాబు ట్రిప్ కు వెళ్లడం చూస్తూ ఉంటాం. అయితే ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా మహేష్ బాబులా తయారవుతున్నాడు అంటూ ఒక టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక మరోవైపు బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు.  అయితే ప్రస్తుతం వార్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే కాస్త బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో వెకేషన్స్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల ఎయిర్పోర్ట్  లో తారక్ కనిపించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అయితే తారక్ ఎక్కడికి వెళ్లారు అన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఎక్కువగా మహేష్ బాబు మాత్రమే ఇలా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు తారక్ కూడా మహేష్ బాబు లాగే మారిపోయాడు  అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: