బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకు, నటుడు అభిషేక్ బచ్చన్ ను వివాహమాడి వెండితెరకు బ్రేక్ ఇచ్చింది.ఇక ఆ తరువాత ఆరాధ్యకు జన్మనిచ్చి.. ఆమెను అల్లారుముద్దుగా పెంచుతూ కాలం గడిపేసింది. ఇక ఆరాధ్య పెద్దది అయ్యాకా ఐశ్వర్య రీఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తుంది.ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్.. ఐశ్వర్యకు మంచి గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఫ్రాన్స్ లో జరిగే కేన్స్ ఫెస్టివెల్ కు ఐష్ కు విడదీయరాని సంబంధం ఉంది. ప్రతి ఏడాది .. ఈ కేన్స్ ఫెస్టివెల్ లో ఐష్ ఎలాంటి డ్రెస్ వేసుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.ఇక ఈ ఏడాది 77 వ కేన్స్ ఫెస్టివెల్ వేడుకలు ఇప్పటికే మొదలయ్యిపోయాయి. ఈ నెల 25 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఇండియా తరుపున ఐష్.. ఈ వేడుకలకు హాజరుకానున్న విషయం తెల్సిందే. ఈసారి కేన్స్ కు ఐష్ తో పాటు కూతురు ఆరాధ్య కూడా పయనమయ్యింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. అయితే.. ఐష్ చేతికి గాయం ఉండడంతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆమె కుడిచేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి కనిపించింది.ఇక దీంతో అయ్యో ఐశ్వర్య చేతికి ఏమైంది.. ? అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బ చూస్తుంటే గట్టిగానే తాకినట్లు కనిపిస్తుంది. ఆమె ఎక్కడ అయినా కిందపడిందా.. ? లేక దేనికైనా గుద్దుకుందా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఈ చేతితో ఐష్ కేన్స్ ఫెస్టివెల్ లో ఎలా నడుస్తుంది అనే అనుమానాలు తలెత్తాయి. మరి ఐష్ ఈ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: