తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారు మొదట సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి అప్పట్లో స్టార్ హీరోగా వెలుగొందారు. అలా ఎన్నో వైవిధ్యమైన సినిమాలను చేసి లెజెండరీ గా నిలిచారు. ఆ తర్వాత ఆయన నట వారసుడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు అక్కినేని నాగార్జున. హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తండ్రికి తగ్గ కొడుకుగా ఆయన కూడా హీరోగా మంచి గుర్తింపును పొందడం ఎన్నో బ్లాక్

 బస్టర్ సినిమాల్లో నటించి భారీ గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాదు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో మొదటి వరుసలో ఉన్నారు. ఆ తర్వాత నాగార్జున వారసులుగా అక్కినేని నాగచైతన్య అఖిల్ సుమంత్ సుశాంత్ అందరూ కూడా హీరోలుగా సినిమా పరిశ్రమకు దగ్గరయ్యారు. ప్రస్తుతం వీరందరూ హీరోలుగా నిర్మాతలుగా అక్కినేని మూడవ తరం వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అఖిల్ సైతం హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

 ఇకపోతే అక్కినేని మూడవ తరం వారసులు అందరూ కలిసి నటించిన చివరి సినిమా మనం. ఇక ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావుకి చివరి సినిమా. ఇందులో నాగేశ్వరరావు నాగార్జున నాగచైతన్య అఖిల్ సమంత అందరూ కలిసి నటించారు. డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కాగా ఈ సినిమాలో అమల అఖిల్ గెస్ట్ రోల్ లో కనిపించారు. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా విడుదలై 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా మనం సినిమాను మరొకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈనెల మే 23న మనం సినిమాను మరొకసారి రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: