టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లో మొదటగా చెప్పే పేరు ప్రభాస్. డార్లింగ్ అని పిలుచుకునే తన అభిమాన హీరో పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఎవరితో జరుగుతుంది అని ఎంతో కాలంగా వెయి కన్నులతో అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. 'డార్లింగ్స్..చివరికి ఒకరు మన జీవితంలోకి రాబోతున్నారు. కాస్త వెయిట్ చేయండి చెప్తా” అంటూ ప్రభాస్ తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో స్టోరీ పోస్ట్ చేశారు. అయితే ఇది డార్లింగ్ పెళ్లి వార్తకు సంబంధించిన విషయమేనంటూ ప్రభాస్ అభిమానులు ఎగ్సైట్ అవుతున్నారు. అన్నా.. వదినెవరో చెప్పు అంటూ.. పోస్టులు పెడుతున్నారు.నాలుగు పదుల వయసు దాటినా.. మన డార్లింగ్ స్టిల్ బ్యాచిలర్ గానే ఉండిపోయారు. ప్రభాస్ ఊ కొడితే.. పెళ్లికోసం అమ్మాయిలంతా లైన్ లో నిలబడతారు. అలాంటి డార్లింగ్ పెళ్లికి ఎందుకంత దూరంగా ఉన్నారన్నదానిపై చాలా వార్తలొచ్చాయి. అందులో మెయిన్.. అనుష్కతో ప్రేమాయణమని. బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి -2 ఇలా వరుస సినిమాలు చేసిన వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంకా పెళ్లి పీటలెక్కలేదని ఒకానొక టైమ్ లో వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ ఆ వార్తలపై రియాక్ట్ అవ్వలేదు. బాహుబలి సమయంలో తామిద్దరం మంచి స్నేహితులమని మాత్రం చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆదిపురుష్ లో నటించిన కృతి సనన్ తోనూ డేటింగ్ లో ఉన్నారన్న రూమర్లు వచ్చాయి.

తాజాగా ప్రభాస్.. త్వరలో మన జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారని ఇన్ స్టా స్టోరీ పెట్టడంతో.. వదినమ్మ వచ్చేస్తుందంటూ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కొందరు వదినమ్మ అనుష్కనే అంటూ.. మీమ్స్ కూడా చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంకొందరైతే అదేం కాదు.. మేనకోడలు పుట్టిందని కామెంట్స్ చేస్తున్నారు.మరి నిజంగానే ప్రభాస్ ఒక వ్యక్తి గురించే చెప్తారా లేక.. ఇదేమైనా సినిమా స్టంటా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898AD సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కి నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తామని చిత్రయూనిట్ నిన్ననే ప్రకటించింది. దీనితో పాటు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమాలోనూ ప్రభాస్ నటిస్తున్నాడు. మరి ఈ రెండు చిత్రాల్లో ఏదైనా అప్డేట్ గురించి చెప్పడానికి డార్లింగ్ ఆ స్టోరీ పెట్టాడా అని కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.ఇవేవీ కాకుండా.. హీరోయిన్లు పెళ్లి చేసుకోకుండా, నవమాసాలు మోయకుండా బిడ్డల్ని కన్నట్టుగానే.. ప్రభాస్ కూడా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాలని ఫిక్సై.. సరోగసి ద్వారా బిడ్డను కంటున్నాడా ? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రభాస్ దేని గురించి అప్డేట్ ఇస్తాడో వేచి చూడాలి. ఈ అప్డేట్ పెళ్లి గురించే అయితే.. డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మరో ట్రెండ్ ను సెట్ చేయడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: