జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... జాన్వి కపూర్మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో ఫస్ట్ భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర నేపథ్యంలో మే 19 వ తేదీన ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో వచ్చింది అంటూ పలువురు సినీ ప్రముఖులు కూడా చెబుతూ రావడంతో ఈ పాటపై విడుదలకు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన మరో సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దేవర మేకర్స్ ఎన్టీఆర్ , జాన్వి కపూర్ పై అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

అందులో భాగంగా మే 24 వ తేదీ నుండి ఈ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు , దాదాపు ఏడు రోజుల పాటు ఈ సాంగ్ నీ చిత్రీకరించడానికి మేకర్స్ డిసైడ్ అయినట్లు ఒక వేళ అనుకున్న అవుట్ పుట్ రానట్లు అయితే మరికొన్ని రోజులు పెంచి అయినా సరే ఈ రొమాంటిక్ సాంగ్ ను అదిరిపోయే రేంజిలో చిత్రీకరించి వెండి తెరపై ఈ సాంగును చూసేటప్పుడు ప్రేక్షకులకు అద్భుతమైన ఫీలింగ్ వచ్చే విధంగా దీనిని తీర్చిదిద్దడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: