తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనులలో ఒకరు అయినటువంటి ఈషా రేబ్బా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకే తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో , వెబ్ సిరీస్ లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె కేవలం సినిమాల్లో తన నటనతో మాత్రమే కాకుండా వీలు చిక్కినప్పుడల్లా ఎన్నో సినిమాల్లో తన అందాలను కూడా ఆరబోసి తన స్కిన్ షో తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా పూజ హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అరవింద సమేత అనే సినిమాలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి విజయం సాధించినప్పటికీ ఈమెది అందులో చిన్న పాత్ర కావడం ద్వారా పెద్దగా ఈమెకు గుర్తింపు రాలేదు. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఆ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

అందులో భాగంగా అరవింద సమేత సినిమా తన చేయాలి అనుకోలేదు అని చెప్పింది. ఇక తాజా ఇంటర్వ్యూ లో ఈమె అరవింద సమేత సినిమా గురించి మాట్లాడుతూ ... నాకు అరవింద సమేత సినిమా కథ చెప్పినప్పుడు నేను ఒప్పుకోలేదు. ఎందుకు అంటే నాకు సినిమాలో ప్రధాన పాత్ర చేయాలి అని ఉండేది. అందుకే నేను ఈ మూవీ ని ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత సినిమాలో నాది ప్రధాన పాత్ర అంటూ దర్శక నిర్మాతలు నన్ను ఒప్పించారు. సినిమా మొత్తం పూర్తి అయిన తర్వాత నాకు సంబంధించిన సన్నివేశాలు ఎడిటింగ్ లో పోయాయి. కనీసం నాకు సెకండ్ లీడ్ గా కూడా గుర్తింపు రాలేదు. అందుకే ఆ మూవీ విషయంలో ఎంతో బాధపడ్డా అని ఈషా తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: