టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ , బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 అనే భారీ బడ్జెట్ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇక మొదట మేకర్స్ ఈ సినిమాలో హ్రితిక్ కి సంబంధించిన సన్నివేశాలను ముంబై లో చిత్రీకరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కి సంబంధించిన సన్నివేశాలను ముంబై లో చిత్రీకరించారు.

ఇక వీరిద్దరూ కలిసి ఉండే సన్నివేశాలను కూడా కొన్నింటిని మేకర్స్ ఇప్పటికే తెరకెక్కించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న మూవీ కావడం ఇండియా వ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండడంతో అదే స్థాయిలో ఈ ఐటమ్ సాంగ్ ను కూడా మేకర్స్ తెరకెక్కించడానికి తెలుస్తోంది.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న కత్రినా కైఫ్ తో ఐటమ్ సాంగ్ చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు అందులో భాగంగా కత్రినా ను కొన్ని రోజుల క్రితమే ఈ విషయమై సంప్రదించగా ఈ బ్యూటీ కూడా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఇండియాలోనే అత్యంత బెస్ట్ డాన్సర్ లుగా ఎన్టీఆర్ , హృతిక్ కి పేరు ఉంది. ఇలా వీరిద్దరూ ఒకే సినిమాలో నటిస్తూ ఉండడం , అందులో ఓ భారీ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తూ ఉండడంతో ఈ సినిమాలోని ఈ సాంగ్ లో వీరిద్దరూ ఏ స్థాయిలో డాన్స్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: