పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే సమయం దొరికిన ప్రతిసారి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.నిజానికి ఆయనకి సినిమాలు చేసే అవసరం లేకపోయిన కూడా తన అభిమానులను అలరించాలనే ఉద్దేశ్యం తోనే ఆయన సినిమాలు చేస్తున్నాడు. నిజానికి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పాలిటిక్స్ లోకి వచ్చాడు తప్ప ఇతర నాయకులు కదా డబ్బును దుర్వినియోగం చేసినట్టుగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా డబ్బులను సంపాదించుకోవడానికి మాత్రం తను పాలిటిక్స్ లోకి రాలేదు.ఎందుకంటే తను సినిమాలు చేస్తేనే సంవత్సరానికి దాదాపు 500 కోట్ల వరకు డబ్బులు సంపాదించుకోవచ్చు. అయిన కూడా వాటిని వదిలేసి సమాజ సేవ కోసం పాలిటిక్స్ లోకి వచ్చిన ఒకే ఒక నాయకుడిగా కూడా మనం పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఆయనకు ఒకప్పుడు భారీ క్రేజ్ అయితే ఉండేది. ఇక 2005వ సంవత్సరంలో అశ్వినీ దత్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ బి.గోపాల్ లాంటి మాస్ డైరెక్టర్ రాసుకున్న కథతో పవన్ కళ్యాణ్ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలనే ప్రణాళికలైతే వేసుకున్నాడు.

ఇక దానికోసం పవన్ కళ్యాణ్ కి దాదాపు 15 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఇస్తానని చెప్పారట. అప్పట్లో 10 కోట్లు అంటేనే చాలా ఎక్కువ చిరంజీవి కూడా 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం 15 కోట్లు ఇస్తానని చెప్పిన కూడా ఆ సినిమా స్టోరీ సరిగ్గా లేకపోవడంతో ఆయన సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే మరొక కథతో వస్తే తను సినిమా చేస్తానని చెప్పారట.అయినప్పటికీ అశ్విని దత్ మరో కథతో వెళ్లిన కూడా పవన్ కళ్యాణ్ ఆ కథని కూడా సున్నితంగా రిజెక్ట్ చేసినట్టుగా వార్తలైతే వచ్చాయి. ఇక మొత్తానికైతే ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాప్ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని తీసుకునే స్థాయికి వెళ్ళాడనే చెప్పాలి. ఇప్పుడు కూడా ఆయన కనక సినిమాల మీద ఫోకస్ పెడితే ఇండియాలో ఎవరికి ఇవ్వలేనంత రెమ్యూనరేషన్ తనకు ఇస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: