తెలుగులో అగ్ర హీరోల సరసన కమర్షియల్‌ సినిమాలు ఓకే చేస్తూ, యాక్ట్‌ చేస్తున్న జాన్వీ కపూర్‌. బాలీవుడ్‌ ప్రయాణంలో మాత్రం ప్రయోగాలకు, హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు ప్రాధాన్యమిస్తోంది.ఈ క్రమంలో ఆమె నటించిన 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి' సినిమా విడుదలకు సిద్ధమైంది. రాజ్‌కుమార్‌ రావ్‌ మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న జాన్వీ ఆసక్తికర విషయాలు చెప్పింది.'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి' సినిమా కోసం కష్టపడి క్రికెట్‌ నేర్చుకున్నానని చెప్పిన జాన్వీ.. ఈ క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాను అని చెప్పింది. సినిమా కోసం రెండేళ్ల పాటు క్రికెట్‌లో శిక్షణ తీసుకున్నానని చెప్పిన ఆమె.. దర్శకుడు శరణ్‌ శర్మ తనను క్రికెట్‌ నేర్చుకోవాలని పట్టుబట్టారని తెలిపింది. క్రికెట్‌ సన్నివేశాలు వీఎఫ్‌ఎక్స్‌లో కాకుండా లైవ్‌గా ఉండాలనేది ఆయన ఆలోచనట. ఈ క్రమంలో శిక్షణ సమయంలో ఎన్నో దెబ్బలు తగిలాయని, భుజాలు డిస్‌లొకేట్‌ అయ్యాయని తెలిపింది.

సినిమా కోసం శిక్షణ తీసుకుంటున్న సమయంలో పడ్డ ఇబ్బందుల వల్ల ఈ సినిమా ఛాన్స్‌ వదిలేద్దామని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పింది. కానీ శిక్షకులు అభిషేక్‌ నాయర్‌, విక్రాంత్‌ మాత్రం తనకు అండగా నిలిచి, క్రికెట్‌ ఆడటంతో సపోర్టుగా నిలిచారు అని చెప్పింది జాన్వీ. వారి వల్లే క్రికెట్‌ నేర్చుకున్నానని, వారు లేకపోతే 'మిస్టర్‌ మిసెస్‌ మాహీ'లో తాను ఉండేదానిని కాను అని క్లారిటీ ఇచ్చేసింది.ఈ సినిమా ప్రచారంలో 6 నంబరు ఉన్న దుస్తుల్ని జాన్వీ వాడుతోంది. ఆ నెంబరుకు సినిమాలో హీరోయిన్‌ పాత్రకు ఓ కనక్షన్‌ ఉందనట. మహిమ క్రికెట్‌లో 6 నంబరు గల జెర్సీని ధరిస్తుంది. ధోనికి వీరాభిమాని అని మహీ సినిమా కాబట్టి 7 నెంబరు వాడదాం అని అనుకున్నారట. కానీ ఆ నంబరు ధోనీకి మాత్రమే సొంతం అని 6ను తీసుకున్నారట. అలాగే 6 జాన్వీ లక్కీ నంబరు కూడా. అన్నట్లు ఈ సినిమా మే 31న వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: