జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక అనసూయకి హీరోయిన్ రేంజ్ లో ఫాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో సైతం ఈమెకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే అనసూయ ఏ పోస్ట్ చేసినా కూడా అది ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా అనసూయ తన 39వ పుట్టినరోజుని జరుపుకుంది. ఇందులో భాగంగానే తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు సందర్భంగా వెకేషన్ కి వెళ్ళింది. అక్కడే తన

 పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. ఇక వాటికి సంబంధించిన ఫోటోలను తన ఫాన్స్ తో కూడా పంచుకుంది అనసూయ.  అనసూయ తన భర్త పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. పొట్టి బట్టలు ధరించి తెగ ఎంజాయ్ చేస్తోంది. దాంతో ప్రస్తుతం అనసూయ కి సంబంధించిన ఈ క్రేజీ లుక్స్ సోషల్ మీడియాలో  ఆకట్టుకుంటున్నాయి. కొండల్లో కోనల్లో తిరుగుతూ తన భర్తతో రొమాంటిక్ ఫోటోలకి ఫోజులిస్తుంది ఈ బ్యూటీ. అంతేకాదు మినీ డ్రెస్ లో జలపాతాల దగ్గర జలకాలాడుతుంది. పూర్తిగా తన భర్త పిల్లలతో కంప్లీట్ ఎంజాయ్ మూడ్ లోకి

 వెళ్లిపోయింది. ప్రస్తుతం అనసూయ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ ఫోటోలో వైరల్ అవుతున్నాయి. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్పటు సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది అనసూయ.  ఈ సినిమాతో అనసూయ కి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కింది అని చెప్పొచ్చు. దాంతోపాటు గత ఏడాది ఈమె విమానం పెదకాపు ప్రేమ విమానం రంగమార్తాండ మైఖేల్ వంటి సినిమాల్లో నటించిన భారీ గుర్తింపు తెచ్చుకుంది. మొదట జబర్దస్త్ లో యాంకర్ గా వ్యవహరించిన అనసూయ ఇప్పుడు తనకి సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడంతో బుల్లితెరకి కూడా గుడ్ బై చెప్పేసింది. తాజాగా అనసూయ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 నుండి తన లేటెస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. దాంతో ప్రస్తుతం ఈ లుక్ సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: