బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న సోహెల్ ప్రధాన పాత్రలో బుట్ కట్ బాలరాజు అనే సినిమా రూపొందింది. ఈ మూవీ లో మేఘ లేఖ , సునీల్ , ఇంద్రజ , సిరి హనుమంత్ , జబర్దస్త్‌ రోహిణి ముఖ్య పాత్రలలో నటించగా ... కోనేటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2 , 2024 న థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి కలెక్షన్ లను వసూలు చేయడంలో ఫెయిల్ అయ్యింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై ప్రసారం అయ్యింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ఈ టీవీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మే 5 , 2024 న సాయంత్రం 5: 00 గంటలకి ఈ టీవీ తెలుగు లో ప్రసారం చేశారు. ఇక ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడంలో కూడా దాదాపుగా ఫెయిల్ అయింది. ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం కాగా ఈ సినిమాకి కేవలం 1.34 "టి ఆర్ పి" రేటింగ్ మాత్రమే వచ్చింది.

ఇక ఈ సినిమాకు వచ్చిన "టి ఆర్ పి" రేటింగ్ ను బట్టి చూస్తే ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడంలో ఫెయిల్ అయింది అని చెప్పవచ్చు. ఇక ఈ మూవీ ద్వారా సోహెల్ మంచి విజయాన్ని అందుకుంటాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా ఆయనకు నిరాశనే మిగిలింది. మరి రాబోయే సినిమాలతో సోహెల్ ఎలాంటి సక్సెస్ లను అందుకుంటాడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: