జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు రావడం , ఆస్కార్ అవార్డు దక్కడం అలాగే ఇందులో ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఒక్క సారిగా ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. దానితో ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ ను మరింత పెంచుకోవడం కోసం తన తదుపరి మూవీ లను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం దేవర పార్ట్ 1 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

ఈ సినిమాలో ఝాన్సీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మే 19 వ తేదీన ఈ సినిమా యొక్క మొదటి పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ లోని మొదటి పాట అయినటువంటి ఫియర్ అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

ఇక ఈ ప్రోమోలో ఈ సినిమా లిరిక్స్ కు సంబంధించి పెద్దగా ప్రింట్ ఇయ్యకపోయినప్పటికీ అద్భుతమైన స్కోర్ మాత్రం బయటకు రిలీజ్ చేశారు. ఈ స్కోర్ అదిరిపోయే రేంజ్ లో ఉంది. ఈ సాంగ్ మొత్తం కూడా ఇదే బీట్ లో కనుక ముందుకు సాగినట్లు అయితే అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలి అంటే మే 19 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: