యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మొదట ఒక భాగం అనే ఉద్దేశం తోనే మొదలు పెట్టారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా దర్శకుడు అయినటువంటి కొరటాల శివసినిమా కథ పెద్దది , ఇందులోని క్యారెక్టర్ల స్పాన్ కూడా చాలా పెద్దది, ఇంత గొప్ప కథని కేవలం ఒక భాగంలో మాత్రమే చెప్పలేము. అందుకే ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము అని ప్రకటించాడు.

దానితో ఒక్క సారిగా ఈ సినిమాపై మరింత అంచనాలు ప్రేక్షకుల్లో పెరిగిపోయాయి. ఎంత గొప్ప కథ అయి ఉండకపోతే ఒక భాగంలో చూపించలేకపోతున్నారు..? కచ్చితంగా ఈ సినిమా కథలో ఫుల్ దమ్ము ఉండి ఉంటుంది. అందుకే ఈ మూవీ ని 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మే 19 వ తేదీన ఈ సినిమా లోని మొదటి పాటను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ రోజు ఈ సినిమా యొక్క మొదటి పాట ప్రోమోను విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాలు నుండి లభించింది. కొన్ని రోజుల క్రితమే ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ మొదటి సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉంది.

ఈ సాంగ్ వచ్చాక హుకుం సాంగ్ ను మరిచిపోతారు అని చెప్పాడు. ఇక తాజాగా విశ్వక్ సేన్ దేవర సినిమా యొక్క మ్యూజిక్ మరో లెవల్లో ఉండబోతుంది. ఈ సినిమా మొత్తం ఆల్బమ్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని చెప్పాడు. ఇలా సినీ ప్రముఖులు ఈ సినిమా ఆల్బమ్ పై గొప్పగా చెప్పుతూ ఉండటంతో ఈ మూవీ ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: