బాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న బోనీకపూర్ కూతురుగా, అతిలోకసుందరి దివంగత నటి శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వి కపూర్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఇక ఇప్పుడు తన అదృష్టాన్ని టాలీవుడ్ లో కూడా పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. జాన్వీ కపూర్ నటిస్తున్న దేవర సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. అటు చరణ్ సరసన కూడా ఓ సినిమాలో నటించే ఛాన్స్ ను దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఇక ఇలా టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి ఇక్కడ తల్లి లాగానే స్టార్ హీరోయిన్ గా ఎదిగి హవా నడిపించాలని అనుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే జాన్వికపూర్.. తన సినిమాల అప్డేట్స్ మాత్రమే కాకుండా తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా తన లవ్ విషయంపై ఓపెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తన ప్రియుడి గురించి అన్ని విషయాలను చెప్పేసింది. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.


 తన ప్రియుడు శిఖర్ పహరియా చాలా సపోర్టివ్ అయిన వ్యక్తి అంటూ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది. మేము ఇద్దరం ఒకరిని ఒకరం ఎప్పుడూ సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అంటూ చెప్పుకొచ్చింది. మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయాలను తెలిపింది. నాకు 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే శిఖర్ పహారియాతో పరిచయం ఏర్పడింది. అప్పుడు నుండి మేము ఎంతో సన్నిహితంగా ఉంటూ వచ్చాము. ఇక మేమిద్దరం కలిసే పెరిగాము  నా కలలను తన కలలుగా శిఖర్ భావిస్తాడు. ఇక నేను కూడా అతని డ్రీమ్స్ ని నా డ్రీమ్స్ అనుకుంటాను అంటూ జాన్వికపూర్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: