మొన్నటి వరకు అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకడిగా కొనసాగిన జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్ కు వెళ్ళిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం తారక్ సినిమా వస్తుందంటే చాలు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాగా త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్  అయితే ఇప్పటికే తనకు హిట్టిచ్చిన దర్శకుడు కొరటాల శివతో ఒక మూవీ చేస్తున్నాడు.


 దేవర అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.  ఈ మూవీ ముగిసిన తర్వాత అటు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ మూవీపై కూడా అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే బాగుండు అని అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాగా ఎన్టీఆర్ = ప్రశాంత్ నీల్ కాంబో మూవీ గురించి ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఈ మూవీ కోసం ఒక పవర్ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారట మేకర్స్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఇక అక్టోబర్లో ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందట. ఇక ఈ సినిమాను కూడా రెండు పార్ట్ లుగా తెరకెక్కించాలని ప్లాన్ వేశాడట డైరెక్టర్ ప్రశాంత్. కాగా ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అటు సలార్ 2 మూవీ తో బిజీగా ఉండగా.  జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ తో పాటు వార్ 2 సినిమా షూటింగ్ తో కూడా బిజీగా ఉన్నాడు. ఇవి ముగిసిన తర్వాతే డ్రాగన్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: