కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో యాష్ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం కే జి ఎఫ్ చాప్టర్ 1 , కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ లలో హీరో గా నటించాడు. ఈ మూవీ ల కంటే ముందు ఈయన కేవలం కన్నడ సినీ పరిశ్రమలో మాత్రమే క్రేజ్ ను కలిగి ఉన్నాడు. ఇక ఎప్పుడూ అయితే కే జీ ఎఫ్ సిరీస్ మూవీ లు విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయో ఒక్క సారిగా ఈ నటుడుకి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదల అయిన అతి తక్కువ కాలంలోనే ఈయన మరో మూవీ ని మొదలు పెడతాడు అని చాలా మంది అనుకున్నారు.

అందులో భాగంగా ఈయన నర్తన్ అనే దర్శకుడి తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే నర్తన్ కూడా తన తదుపరి మూవీ ని యాష్ తో చేయనున్నట్లు ప్రకటించాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు ఆ మూవీ ఆగిపోయింది. ఇక ఆ తర్వాత చాలా కాలం పాటు ఏ సినిమాను ఓకే చేయని యాష్ కొన్ని రోజుల క్రితమే గీత మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సీక్ అనే సినిమాను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇక ఈ మూవీ లో యాష్ కి సోదరిగా లేడీ సూపర్ స్టార్ నయన తార కనిపించబోతున్నట్లు ఓ టాక్ నడుస్తోంది. కేవీఎన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ మూవీ నీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ లో యాష్ కి జోడిగా కియార అద్వానీ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ఈమెకు కథను వినిపించగా ఈ బ్యూటీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: