కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరో లలో సూర్య ఒకరు. ఈయన ప్రస్తుతం శివ దర్శకత్వం లో రూపొందుతున్న కంగువా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు . ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని మరి కొంత కాలంలోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సూర్య తన తదుపరి మూవీ పై కాన్సన్ట్రేషన్ పెట్టాడు.

అందులో భాగంగా ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీరి కాంబో మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చి చాలా కాలమే అవుతుంది. కార్తీక్ సుబ్బరాజు సూర్య తో చేయబోయే సినిమాలో హీరోయిన్ ని తాజాగా ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో సూర్య సరసన పూజ హెగ్డే అయితే హీరోయిన్ గా బాగుంటుంది అని ఉద్దేశంతో యూనిట్ ఈ బ్యూటీ ని సంప్రదించి కథను వివరించగా ఆమె కూడా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ యొక్క షూటింగ్ వచ్చే నెల మొదటి వారం నుండి అండమాన్ దీవుల్లో స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ తొలి షెడ్యూల్ దాదాపు 40 రోజుల పాటు సాగబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ నీ లవ్ ప్లేస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: