సుకుమార్,  అల్లు అర్జున్ కలయికలో వచ్చిన  'పుష్ప: ది రైజ్' ఏ స్థాయిలో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అదే భారీ విజయాన్ని కొనసాగించే ఉద్దేశంతో పార్ట్ 2 సినిమా రూపొందుతోంది. ఇప్పటికే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీ షూటింగ్ వర్క్, రామోజీ ఫిల్మ్ సిటీలో హాడావిడిగా కొనసాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదలకి సిద్ధమవుతున్న పుష్ప 2 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ కానుంది. ఇక రిలీజ్ టార్గెట్ కోసం చిత్రబృందం పగలు రాత్రులు తేడా లేకుండా లెక్క చేయకుండా చాలా కష్టపడి పనిచేస్తోంది.అసలైతే ఇప్పటికే మలేషియాలో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయాలనుకున్నారు మూవీ టీం వారు. కానీ సమయం తక్కువ ఉండడం వల్ల వారికి సాధ్యం కాలేదు. దీంతో రామోజీ ఫిల్మ్ సిటీలోనే మలేషియా హడావుడి క్రియేట్ అయ్యేలా భారీ సెట్ ను పునర్నిర్మించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు మూవీ టీమ్. ఈ భారీ సెట్ కూడా మలేషియాలోని వాతావరణాన్ని ప్రతిఫలింపచేలా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్ అనేది దాదాపుగా వేగంగా సాగుతున్నప్పటికీ, రెండు ముఖ్యమైన అంశాలు మాత్రం టీమ్‌ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఈ చిత్రానికి తగిన డేట్లని సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. అతని బిజీ షెడ్యూల్ వల్ల మరో 15 రోజుల కాల్షీట్లు కేటాయించడం చాలా కష్టం అవుతోంది.


ఫహద్ ఈ సినిమాలో కీలక పాత్రలో విలన్ గా కనిపించనున్న విషయం తెలిసిందే, ఇప్పటికే కొంతమేర షూటింగ్ కూడా పూర్తయింది కానీ ఇంకా సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు మిగిలి ఉన్నాయి.అలాగే మరోవైపు ఐటెమ్ సాంగ్ విషయంలో కూడా ఇబ్బందులు తప్పట్లేదు. చిత్రబృందం పలు ప్రముఖ కథానాయికల పేర్లను పరిశీలించినప్పటికీ, ఇంకా ఎవరినీ కన్ఫామ్ చేయలేదు. ఈ సందర్భంలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను తీసుకునే ఆలోచన ఉందని సమాచారం. ఐటెమ్ సాంగ్ విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది.ఇక చిత్రబృందం ఇప్పటికే 'పుష్ప 2' నుంచి ఇటీవల టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది. హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే విధంగా ఉన్న ఈ పాటకు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఏది ఏమైనా, అన్ని అడ్డంకులు దాటుకుని, 'పుష్ప 2' సినిమా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉండటంతో, త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ అందించేందుకు టీమ్ రెడీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: