తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి ఆనంద్ దేవరకొండ తాజాగా గం గం గణేశా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఈ నెల 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూను కూడా చిత్రీకరించారు. ఇక ఈ ఇంటర్వ్యూ లో ఆనంద్ దేవరకొండను ప్రశ్నించే యాంకర్ స్థానంలో జబర్దస్త్ కమెడియన్ అయినటువంటి ఇమన్యుయల్ ఉన్నాడు.

ఈయన ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఆనంద్ దేవరకొండను కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడగగా ఆయన వాటికి అంతే ఫన్నీగా సమాధానాలు ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా హిమాన్యుయల్ మిమల్ని కొన్ని ర్యాండమ్ కోషన్స్ అడుగుతాను అని అనగా దానికి ఆనంద్ ఓకే అనగానే ... కొన్ని రోజుల క్రితమే మీ సినిమా టీజర్ విడుదల అయింది. అది చూసాం. అందులో ఒక లిప్ లాక్ సన్నివేశం ఉంది. అనగానే ఆనంద్ కూడా అవును ఉంది అన్నారు. దానితో ఇమాన్యుయల్ మీ అన్నను చూసి ఆ సన్నివేశం పెట్టుకున్నారా అని ప్రశ్నించాడు.

దానికి ఆనంద్ లేదు హీరోయిన్ ని చూసి పెట్టుకున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఇకపోతే ఇలా ఇమన్యువల్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ చాలా ఫన్నీ ఆన్సర్ ఇవ్వడంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మే 20 వ తేదీన సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. మరి ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: