యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఆర్‌ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి చిత్రంలోనే బోల్డ్ సీన్స్ చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.ఇకపోతే ప్రస్తుతం సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. నేను నా ప్రియమైన వారి కోసం అన్ని ఆదివారాలు విడివిడిగా గడుపుతాను. ఆయన కలిస్తే నేనూ అలాగే చేస్తాను. ప్రభాస్ కోసం లంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అతను ఏది అడిగినా నేను చేయాలనుకుంటున్నాను. '' నాకు ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం. ఆదివారాలన్ని సపరేట్‌గా డార్లింగ్ కోసం సమయం కేటాయిస్తాను. అతను కలిస్తే మాత్రం నేనే స్వయంగా వంట చేసి పెడతాను. ప్రభాస్‌కు నేను లంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అతను ఏది అడిగితే అది చేసి పెట్టాలని నా కోరిక. రాజ్మా రైస్ నా ఫేవరెట్ ఫుడ్. అది స్పెషల్‌గా వండి నా చేత్తో ప్రభాస్‌కు తినిపిస్తాను. చాన్స్ వస్తే అసలు వదులుకోను. నా కోరిక ప్రకారం నా చేత్తో అన్ని చేసి పెడతాను'' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పాయల్ కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తుండగా డార్లింగ్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.మరోవైపు ప్రభాస్ శుక్రవారం ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు. డార్లింగ్స్ త్వరలోనే మనలోకి ఓ కొత్త పర్సన్ రాబోతోన్నారు.. గుడ్ న్యూస్.వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఓ పోస్ట్ వేశాడు. అయితే ఈ పోస్ట్ వేసిన కాసేపటికే పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాలో నేను కచ్చితంగా ఎవరికో ఒకరికి డార్లింగ్ అవుతున్నా.. ఎనీ గెస్ అంటూ ఓ వీడియోని వదిలింది. దీంతో పాయల్, ప్రభాస్ మధ్యలో ఏదో ఉందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: