హీరో తరుణ్.. ఇప్పటి ప్రేక్షకులకు ఈయన పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90s కిడ్స్ లో మాత్రం తరుణ్ అంటే తెలియని వారు ఉండరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అంతేకాదు ఇక ఇండస్ట్రీలో లవర్ బాయ్గా కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అప్పట్లో తరుణ్ సినిమా వస్తుందంటే చాలు తప్పకుండా హిట్ అవుతుంది అనే భావన ప్రేక్షకుల్లో కూడా ఉండేది.


 కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం సరైన అవకాశాలు రాకపోవడం ఇండస్ట్రీలో పోటీ ఎక్కువ అవడంతో ఒకప్పుడు లవర్ బాయ్ గా ప్రేక్షకులను అలరించిన తరుణ్ ఆ తర్వాత కనుమరుగైపోయాడు. అయితే తరుణ్ రీ ఎంట్రీ  ఇవ్వబోతున్నాడు అంటూ ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక దీనిపై ఆయన స్పందించకపోవడంతో అభిమానుల్లో కూడా ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఈ విషయంపై ఇటీవల తరుణ్ తల్లి క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.


 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆమె. ఈ క్రమంలోనే తరుణ్ అభిమానులందరికీ కూడా ఒక శుభవార్త చెప్పింది. తన కొడుకు తరుణ్ త్వరలోనే సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని.. దాని గురించి ప్రస్తుతం ఆలోచిస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఎలాంటి కథలు చేయాలనేది తరుణ్ నిర్ణయిస్తాడు అంటూ తెలిపింది. ఇక అతి త్వరలోనే అభిమానులందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక మాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఇక తరుణ్ చాలా ఏళ్లుగా వాటిల్లో చేరి లాభాలు గడిస్తున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఏది పడితే అది చేస్తే ఫేమ్ రాదు. కాబట్టి రీ ఎంట్రీ విషయంలో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చింది ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: