టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన షాక్ అనే మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత మిరపకాయ్ మూవీ తో కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఇక మిరపకాయ్ మూవీ తర్వాత ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ తో ఒక్క సారిగా హరీష్ శంకర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

గబ్బర్ సింగ్ మూవీ తర్వాత నుండి పవన్ అభిమానులు మరోసారి పవన్ , హరీష్ కాంబోలో ఎప్పుడు మూవీ వస్తుందా అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశారు. ఇక కొన్ని రోజుల క్రితమే మైత్రి సంస్థ వారు పవన్ హీరోగా హరీష్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని ప్రారంభించారు. ఈ మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఆ సినిమా ఆగిపోయింది.

ఇక పవన్ రాజకీయ పనులను పూర్తి చేసుకునే లోపు హరీష్ మరో మూవీ పూర్తి చేయొచ్చు అనే ఉద్దేశంతో రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. ఇకపోతే పవన్ పిఠాపురం నుండి పోటీలోకి దిగారు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన పవన్ ఈ సారి దాదాపుగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒక వేళ పవన్ గెలిచినట్లు అయితే మరికొన్ని రోజులు కూడా రాజకీయ పనుల్లోనే బిజీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దానితో హరీష్ ఒక వేళ పవన్ గెలిచి రాజకీయ పనులతో బిజీగా ఉంటే ఆ గ్యాప్ లో రామ్ పోతినేని తో ఓ మూవీ చేయాలి అని ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగానే రామ్ తో హరీష్ మూవీ ప్లాన్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఏమైపోతుంది అనే అనుమానం పవన్ అభిమానుల్లో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: