నందమూరి బాలకృష్ణ పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా భగవంత్ కేసరి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని బాలకృష్ణ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే బాలయ్య "వాల్తేరు వీరయ్య" మూవీ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.

 అన్నట్లుగానే భగవంత్ కేసరి సినిమా పనులు పూర్తి కాగానే బాబి దర్శకత్వంలో బాలయ్య మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఎన్ బి కే 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రేయ రెడ్డిమూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే  ఇన్ని రోజుల పాటు ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అని ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది.

ఇక ఈ మూవీ బృందం ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయాలి అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే తేదీన ఎన్టీఆర్ "దేవర" మూవీ ఉంది కదా అనే డౌట్ మీకు రావచ్చు. దేవర సినిమాకు సంబంధించిన పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ కావడంతో ఈ మూవీ ని చెప్పిన తేదీ కంటే ముందే విడుదల చేయనున్నట్లు అలా చేసినట్లు అయితే బాలయ్య , బాబి కాంబో మూవీ అక్టోబర్ 10 వ తేదీన రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nbk