నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. బాలయ్య వరుస అపజాయలతో డీలా పడిపోయిన సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ లో హీరో గా నటించి పవర్ఫుల్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ విజయం ఎప్పుడు దక్కిందో అప్పటి నుండి బాలయ్య వరుస విజయాలను అందుకుంటు ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. ఆఖండ మూవీ తర్వాత బాలయ్య "వీర సింహా రెడ్డి" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ 2023 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా బాలయ్య హీరోగా రూపొందిన భగవంత్ కేసరి మూవీ విడుదల అయింది. ఈ సినిమా కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇలా అఖండ , వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి మూడు మూవీ లతో సాలిడ్ విజయాలను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 లో నటించబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ పూర్తి అయినట్లు దర్శకుడు శ్రీను వెల్లడించాడు. ఇక ప్రస్తుతం ఈ మూవీ బడ్జెట్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది. ఈ మూవీ ని బోయపాటి 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో ఈ మూవీ కి అంత బడ్జెట్ పెద్ద విషయం ఏమీ కాదు అని బాలయ్య అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: