టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. రేపు అనగా మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ప్రకటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అందులో భాగంగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు అదే టైటిల్ ను రేపు రీవిల్ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ టైటిల్ మేకర్స్ ఈ మధ్య అనుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. కాకపోతే ఈ సినిమా టైటిల్ ను ప్రశాంత్ నీల్ చాలా కాలం క్రితమే అనుకున్నట్లు తెలుస్తోంది. 2022 టైం లోనే ఈ సినిమాకు ఈ టైటిల్ అయితే బాగుంటుంది అని ప్రశాంత్ అనుకొని అప్పుడే దేనిని కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది.

కాకపోతే అప్పటికే డ్రాగన్ అనే టైటిల్ ను బాలీవుడ్ నిర్మాత అయినటువంటి కరణ్ జోహార్ రిజిస్టర్ చేయించుకున్నాడట. అది తెలిసిన ఎన్టీఆర్ ఆయనను సంప్రదించగా ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో ఆయన వెంటనే ఈ టైటిల్ ను ఇచ్చేసారట. కేవలం హిందీ లో మాత్రమే కాదు తమిళ్ లో కూడా ఈ టైటిల్ ను ఒక యువ హీరో రిజిస్టర్ చేయించాడట.

ఆయన మరెవరో కాదు లవ్ టుడే మూవీ లో హీరోగా నటించి , ఈ మూవీ కి దర్శకత్వం వహించిన ప్రదీప్ రంగనాథన్. ఇతను కూడా ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించాడట. ఆయన కూడా ఎన్టీఆర్ మీద అభిమానంతో ఈ టైటిల్ ఇచ్చేసారట. ఇలా కరణ్ జోహార్ , ప్రదీప్ రంగనాథన్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ మీదున్న అభిమానంతో ఈ టైటిల్ ను వదిలి వేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: