తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో ఎన్నో సినిమాలను విజయం వైపు తీసుకువెళ్లిన శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన గోదావరి సినిమా నేటితో 18 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ వెనక చాలా పెద్ద కథ నడిచింది. మరి ఈ సినిమా విడుదల అయ్యే నేటితో 18 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది..? ఎవరితో ఈ సినిమా చేయాలి అనుకున్నారు అలాంటి వివరాలు అన్ని తెలుసుకుందాం.

గోదావరి సినిమా కంటే ముందు శేఖర్ "ఆనంద్" మూవీ కి దర్శకత్వం వహించాడు. ఆ సమయంలో శేఖర్ కి పెద్దగా క్రేజ్ లేదు. ఇక ఆనంద్ మూవీ చేస్తున్న సమయంలోనే గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయాలి అని శేఖర్ భావించారు. దానితో ఆనంద్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కమిలినికి గోదావరి డ్రాప్ లో ఓ మూవీ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి కొన్ని సన్నివేశాలను కూడా వివరించారు. కథ సూపర్ గా ఉంది సార్ అని ఆమె చెప్పింది.

ఇక ఆనంద్ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే గోదావరి కథను శేఖర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఈ కథకు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , గోపీచంద్ ఈ ముగ్గురిలో ఎవరు అయినా బాగుంటారు అని శేఖర్ భావించారు. కానీ ఆదే సమయంలో ఈ హీరోలు అంతా వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో సుమన్ ని అప్రోచ్ అయ్యి గోదావరి సినిమాకి హీరోగా సెట్ చేసుకున్నాడు. ఇక హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టారు.

కానీ ఎవరు సెట్ కాలేదు. అలాంటి సమయంలోనే మీ ఆనంద్ సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్మాయి బాగానే ఉంటుంది కదా సార్ అని ఎవరో చెప్పగానే అవును ఆ అమ్మాయి బాగానే ఉంటుంది అని కమలిని ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. సినిమా పూర్తి అయ్యింది. ఇక ప్రచారాలను మొదలు పెట్టి వేసవిలో విడుదల కానున్న చల్లటి సినిమా అని ప్రచారాలను చేశారు. ప్రచారాలకు తగినట్టుగానే ఈ మూవీ వేసవిలో చల్లదనాన్ని తీసుకువచ్చింది. చివరగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: