బేబీ సినిమాతో హీరోగా ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గం గం గణేశా. క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాతో ఉదయ్ భూమిశెట్టి దర్శకుడుగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. హైలైట్స్ పతాకంపై కేదార్ జలగం శెట్టి వంశీ కరుమంచి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగతి శ్రీ వాస్తవ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమా మే 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ట్రైలర్ తో మంచి హైపర్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో

 ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బేబీ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బేబీ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అందరూ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఈ క్రమంలోని రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇందులో భాగంగానే ఆనంద్ దేవరకొండ తాజాగా పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఆనంద దేవరకొండ తన అన్నయ్య

 విజయ్ దేవరకొండ తో మల్టీస్టారర్ సినిమా చేయడం పై పని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆనంద దేవరకొండ మాట్లాడుతూ అన్నతో మల్టీస్టారర్ సినిమా చేయడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అని.. చేస్తే బాగానే ఉంటుంది కానీ సెట్ లో అన్నయ్యతో యాక్ట్ చేయాలంటే కొంచెం భయంగా ఉందని.. గతంలో థియేటర్స్ చేస్తున్నప్పుడు నేను అన్న చెక్మేట్ అనే ఒక నాటకంలో ఆర్టిస్టులుగా చేశామని అందులో అన్న డిటెక్టివ్ పాత్రలో నేను విలన్ పాత్రలో నటించాను అని.. కానీ సినిమాల్లో మల్టీ స్టార్ అంటే దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కష్టమే అంటూ చెప్పాడు. దీంతో ఆనంద దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: