బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆ విషాదాన్ని మరువక ముందే అదే సీరియల్ లో ఆమె సహనటుడు, ప్రియుడు అయిన చంద్ర కాంత్ తన నార్సింగ్ లో తన నివాసంలో బలవన్మరణానికి పాల్పపడ్డారు.పవిత్ర మృతి తట్టుకోలేక ఐదు రోజులు నరకం అనుభవించిన చంద్ర కాంత్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. కొంత కాలంగా వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు రోజు క్రితం పవిత్ర పుట్టిన రోజు.. ఈ సందర్భంగా 'రెండు రోజులు ఆగు..' అంటూ తన ఇన్‌స్ట్రాలో పోస్ట్ పెట్టాడు.అన్నట్టుగానే ఆత్మహత్య చేసుకున్నాడు చంద్రకాంత్. ఇదిలా చంద్రకాంత్ భార్య తాజాగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

త్రినయని సీరియల్ లో కలిసి నటించిన పవిత్ర-చంద్రకాంత్ లు లీవింగ్ రిలేషన్ లో ఉండటమే కాదు.. త్వరలో పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కొంత కాలంగా భార్యాభర్తలుగా ఉంటున్నారు. సీరియల్ లో నటించే సమయానికి పవిత్ర తన భర్తకు విడాకులు ఇచ్చింది.చంద్రకాంత్ 2015 లో శిల్పా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల క్రితం త్రినయని సీరియల్ లో పవిత్రతో పరిచయం ఏర్పడిన తర్వాత చంద్రకాంతో పూర్తిగా భార్యను పట్టించుకోవడం మానేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చంద్రకాంత్ భార్య శిల్ప మాట్లాడుతూ.. 'మేం ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. కొత్తలో ఆయన ఎంతో ఇష్టంగా నన్ను చూసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు. త్రినయని సీరియల్ లో చాన్స్ వచ్చింది.. అదే సమయంలో పవిత్రతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి నాకు నరకం మొదలైంది. ప్రతిరోజూ తాగి వచ్చి నన్ను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇంటి గురించి పట్టించుకోవడం మానేశాడు.. మా అత్తయ్య ఎంత చెప్పినప్పటికీ వినేవాడు కాదు. ఇక పవిత్ర జయరాం నాకు ఫోన్ చేసి చంద్ర కాంత్ నా భర్త నువ్వు మర్చిపో.. అంటూ బెదిరించేది. ఒకసారి నేను ఆమె కొడుకును కలిశాను. వాళ్ల లైఫ్ వాళ్ల ఇష్టం.. వారిద్దరు ఇష్టపడుతున్నారు మాకు దానితో సంబంధం లేదని సమాధానం చెప్పాడు.

ఇంట్లో ఉంటే ఎప్పుడూ ఆమె ధ్యాసే.. ఫోన్ లో వీడియో కాల్ చేస్తూ 'చెప్పవే పాప.. ఏం చేస్తున్నా.. నన్ను మిస్ అవుతున్నావా' అంటూ మాట్లాడేవాడు. నా గురించి అందరికీ నెగిటీవ్ చెబుతూ నన్ను బ్లేమ్ చేసేవాడు. 2004లో ఆయనతో పరిచయం ఏర్పడింది.. 11 ఏళ్లు రిలేషన్ షిప్ లో మా పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో 2015 లో పెళ్లి చేసుకున్నాం. మా జీవితంలోకి పవిత్ర జయరామ్ వచ్చిన తర్వాత నన్ను కొట్టడం, తిట్టడం చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడు. సోషల్ మాద్యమాల్లో నన్ను బ్లాక్ చేశాడు. పవిత్రకు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బెడ్ పై పడుకొని ట్రీట్ మెంట్ తీసుకుంటూ మా ముందే పవిత్ర గురించి ఏడ్చుకుంటూ ఆమెనే తల్చుకున్నాడు. ఇన్నాళ్లు తను అర్థం చేసుకుంటాడు.. తిరిగి వస్తాడన్న నమ్మకంతో బతికాను.. ఇప్పుడు ఆ నమ్మకం కూడ పోయింది.. పవిత్ర కోసం నా జీవితం మొత్తం నాశనం చేశాడు' అంటూ శిల్ప ఎమోషన్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: