జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత  పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉండేటట్లు చూసుకుంటున్నాడు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు దేవర  సినిమాతో మళ్ళీ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవ్వాలి అని చూస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు. ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ప్రోమో ను  విడుదల చేశారు. అది  సోషల్

 మీడియాలో దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా తమిళ స్టార్ హీరో సూర్య సైతం ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో ఫ్యాన్ ఇండియా లెవెల్లో రికార్డ బ్రేక్ చేయాలి అని అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ రెండు సినిమాలు సైతం ఒకే సమయంలో

 విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒకే సమయంలో రెండు సినిమాలు విడుదలవుతే ఏ స్టార్ హీరో కి ప్లస్ అవుతుంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ రెండు సినిమాలు పెద్ద సినిమాలు. అలాగే ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు. మరి ఒకవేళ రెండు సినిమాలు ఒకే సమయంలో గనక విడుదలయితే ఏదో ఒక సినిమాకి కచ్చితంగా నష్టం వాటిల్లుతుంది. నిజానికి టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్నంత మార్కెట్ సూర్యకి లేదు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు సూర్య ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. సూర్యకి తమిళంలో భారీ క్రేజ్ ఉన్నప్పటికీ తెలుగులో ఆ స్థాయిలో క్రేజ్ లేదు. మొత్తం మీద ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకే కాస్త ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏ సినిమా సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే ఈ సినిమాలు విడుదల అయ్యేంతవరకు వెయిట్ చేయాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: