బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిచయమైన సుడిగాలి సుదీర్ ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నాడు. బుల్లితెరపై తన ప్రయాణాన్ని కొనసాగించి అతి తక్కువ సమయంలోనే తన లో ఉన్న టాలెంట్ తో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు సుధీర్. జబర్దస్త్ షో ద్వారా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ జబర్దస్త్ కంటే ముందు ఎన్నో పనులు చేశాడు. డాన్సర్ గా సింగర్ గా హీరోగా యాంకర్ గా కమెడియన్ గా మ్యాజిక్ షోస్ కూడా చేస్తూ భారీ గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా

 ప్రస్తుతం సక్సెస్ఫుల్గా సాగుతున్నాడు. ఇకపోతే 2019లో సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. దాని తరువాత త్రీ మంకీస్ వాంటెడ్ పండుగాడు వంటి సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. దాని తర్వాత గాలోడు సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా కమర్షియల్ గా కూడా బాగానే సక్సెస్ అయ్యింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం గోట్ సినిమా చేస్తున్నాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు సుధీర్ .ఈ సినిమాతో మంచి కం బ్యాక్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే సుధీర్ ఆస్తులకు సంబంధించిన పలు వివరాలు

 సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  సుధీర్ ఆస్తులు విలువ 6 కోట్ల నుండి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని  సమాచారం.  సుధీర్ ఏడాదికి దాదాపుగా 50 లక్షల నుండి 80 లక్షల వరకు సంపాదిస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. దాంతో పాటు హైదరాబాద్ మహానగరంలో ఒక బిల్డింగ్ కూడా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం  సుధీర్ మణికొండలో ఉంటున్నాడు. ఇకపోతే సుధీర్ కి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. అందులో భాగంగానే సుధీర్ పెళ్లికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. కాగా గత కొద్ది రోజులుగా సుధీర్ తమ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: