టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సోనాలి బింద్రే , అన్షు అంబానీ హీరోయిన్ లుగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో మన్మధుడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2002 వ సంవత్సరం మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ఈ సినిమాకు కథ , మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మూవీ విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి విజయ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా దేవి శ్రీ ప్రసాద్ అసలు ఈ సినిమాల్లోకి ఎలా వచ్చాడు అనే విషయాలను క్లియర్ గా చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ... త్రివిక్రమ్ శ్రీనివాస్ "మన్మధుడు" కథ మొత్తం రెడీ చేశాడు. అది నాకు ఎంతో నచ్చింది. ఇక ఈ సినిమాలో హీరో ఎవరు అయితే బాగుంటుంది అనే ఉద్దేశం లో నాగార్జున అయితే బాగుంటుంది అని ఆలోచనకు వచ్చి నాగార్జున కు సినిమా కథను వినిపించాము. ఆయన ఓకే చెప్పారు. ఇక సోనాలి బింద్రే , అన్షు అంబానీ హీరోయిన్ లుగా ఓకే అయ్యారు.

అలాగే హీరో , హీరోయిన్ల తేదీలు అన్ని ఓకే అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఓకే అయ్యారు. సినిమా స్టార్ట్ చేద్దాం అనుకునే సమయానికి మ్యూజిక్ డైరెక్టర్ సినిమా నుండి తప్పుకున్నాడు. ఏం చేయాలో తెలియలేదు. హీరో , హీరోయిన్ల డేట్ లు దగ్గరికి వస్తున్నాయి.

దానితో నాగర్జున గారు మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ను పెట్టుకోండి అన్నారు. దానితో నాకు దేవి శ్రీ ప్రసాద్ అయితే బాగుంటుందేమో అని అనిపించింది. దానితో పిలిచాను , వెంటనే వచ్చాడు. నేను చెప్పినట్లుగా మ్యూజిక్ చేసి ఇచ్చాడు. ఆ పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది అని విజయ్ భాస్కర్ తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: