టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా 'దేవర'. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దేవర ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న నటిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ లో తారక్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు.దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా 'దేవర'.జనతా గ్యారేజ్ సినిమా అనంతరం వీరిద్దరి కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్రబృందం.తాజాగా దీనికి సంబంధించి అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్రబృందం. దేవర ఫస్ట్ సింగిల్‌ను మే 19 సాయంత్రం 7.02 గంటలకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.దేవర' సినిమాలో ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్'ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ సాంగ్ వింటే ప్రతి అభిమానికి గూస్ బంప్స్ రావడం గ్యారంటీ!

'దేవర' సినిమాకు యంగ్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, మాంచి సింగర్ కూడా! 'ఫియర్ సాంగ్'ను కంపోజ్ చేయడంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్వయంగా పాడారు. ఆయన సంగీతంతో పాటు గాత్రం కూడా సూపర్ అని చెప్పాలి. ఈ పాటను కన్నడ, మలయాళ భాషల్లో సంతోష్ వెంకీ పాడారు.'దేవర'ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడీ పాటను సైతం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఈ పాటకు తెలుగులో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఆల్ హెయిల్ టైగర్ అంటూ ఆల్రెడీ సోషల్ మీడియాలో సాంగ్ ట్రెండ్ అవుతోంది.రామజోగయ్య శాస్త్రి తన సోషల్ మీడియాలో.. ఒక్క రోజు ఓపిక పట్టండి. మన 'అని'…అబ్బా…వర్తు వెయిటింగ్ అనిపిస్తాడు… మనందరినోట. రెండో పాట రికార్డింగ్ కి చెన్నై వచ్చాను. ఇది ఇంకో రకం ప్రకంపనం. అది కోత ఇది లేత అంటూ రెండో పాట కూడా రెడీ అవుతుంది అంటూ అంచనాలు పెంచేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మరింత జోష్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: