నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఎన్ బీ కే 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఇక కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు , శ్రేయ రెడ్డిమూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలకు సంబంధించి మేకర్స్ మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ యొక్క షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఫుల్ జోష్ లో జరుగుతున్న సమయం లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ ల షెడ్యూల్ విడుదల కావడంతో బాలకృష్ణ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ప్రచారాలలో బిజీగా ఉన్నాడు. దానితో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ఎలక్షన్ లు పూర్తి కావడంతో వచ్చే నెల మొదటి వారంలో రిజల్ట్ రానుంది.

రిజల్ట్ వచ్చాక వెంటనే ఈ సినిమా యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్ లో మేకర్స్ ఇంటర్వెల్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ఈ యాక్షన్ సన్నివేశం బాలయ్య కెరియర్ లోనే హైలెట్ గా ఉండే విధంగా డైరెక్టర్ డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేసి ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: