పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం హరి హర విరమాల్లు అనే మూవీ ని మొదలు పెట్టాడు. కానీ ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల ఆగిపోతూ వచ్చింది. ఇప్పటికే రెండు సార్లు ఆగిపోయి మళ్ళీ రీబీస్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ఎలక్షన్ ల కారణంగా మళ్ళీ ఆగిపోయింది. ఇక ఎలక్షన్ లు పూర్తి అయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే రిజల్ట్ కూడా రానుంది. ఈ నేపథ్యం లో పవన్ మళ్ళీ ఈ సినిమాకు బల్క్ డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయంలోకి వెళితే ... పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీలోకి దిగారు. ఇందుకు సంబంధించిన రిజల్ట్ జూన్ 4 వ తేదీన రానుంది. ఇక పవన్ కనుక గెలిచినట్లు అయితే చాలా కాలం పాటు రాజకీయాల పైనే ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దానితో కొత్త సినిమాలు ఏమో కానీ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను మాత్రమే పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా చాలా రోజుల క్రితం స్టార్ట్ అయిన హరిహర వీరమల్లు మూవీ ని ముందుగా పూర్తి చేయాలి అని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఆగస్టు నెల నుండి ఈ సినిమాకు బల్క్ డేట్స్ ను ఇచ్చినట్లు , దాదాపు ఈ సినిమా పూర్తి అయ్యే వరకు వేరే సినిమాను టచ్ చేయకుండా ఈ సినిమాపై పని చేయాలి అని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక పవన్ ఈ సినిమాతో పాటు ఇప్పటికే ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ మూడు సినిమాల షూటింగ్ లను కంప్లీట్ చేసి ఆ తర్వాతే కొత్త మూవీల గురించి ఆలోచించే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: