తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్న అందరు హీరోలు చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. వీలు చెప్పినప్పుడల్లా తమ కుటుంబాలతో కలిసి కూడా వెకేషన్ కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఒకరి ఇంట్లో వేడుకలు జరుగుతే మరొకరు వెళ్లి వాటికి అటెండ్ కావడం , అక్కడ సమయాన్ని గడపడం , అలాగే ఒక హీరో పుట్టిన రోజు జరిగితే మరొక హీరో అతనికి విషెస్ చెప్పడం , ఇలా చాలా మంచి బంధాలు మన టాలీవుడ్ స్టార్ హీరోలు కొనసాగిస్తున్నారు.

కానీ వారి అభిమానులు మాత్రం అనేక దూషణలు చేసుకుంటూ వెళుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఈ రోజు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో నిన్న రాత్రి నుండే ఎంతో మంది సినీ ప్రముఖులు ఈయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో స్టార్ హీరో అయినటువంటి ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్ లో ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేశాడు.

తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా హ్యాపీ బర్త్ డే తారక్ బావ. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు నువ్వు మరెన్నో జరుపుకోవాలని అని నేను కోరుకుంటున్నాను అన్నారు. అలాగే నిన్న దేవర ఫస్ట్ సింగిల్ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే ఆ సాంగ్ ను ఉద్దేశించి అల్లు అర్జున్ "FEAR IS FIRE" అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చాడు. ఇక అల్లు అర్జున్ , ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa