యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఆది అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు ఎన్టీఆర్ కి స్టూడెంట్ నెంబర్ 1 మూవీ తో విజయం దక్కినప్పటికీ అదిరిపోయే మాస్ ఇమేజ్ మాత్రం ఆది సినిమా తోనే దక్కింది. ఈ మూవీ వినాయక్ కి మొదటి సినిమా అయినప్పటికీ అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే ఇందులో ఎన్టీఆర్ ను చూపించిన విధానానికి ఆ సమయంలో వినాయక్ పై ఎన్టీఆర్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.

సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. ఇంతటి ఈమేజ్ ను ఎన్టీఆర్ కి తీసుకువచ్చిన వినాయక్ తన తదుపరి మూవీ ని కూడా ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్నాడు. కానీ అది సెట్ కాలేదు. ఎందుకో తెలుసా ఆ వివరాలు తెలుసుకుందాం. ఆది మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో వినాయక్ , దిల్ రాజు బ్యానర్ లో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. అందులో భాగంగా దిల్ అనే స్క్రిప్ట్ ను మొత్తం రెడీ చేసుకున్నారు.

స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయ్యాక మొదట ఈ కథను ప్రభాస్ కి వినిపించారు. కానీ ప్రభాస్సినిమా చేయను అని చెప్పాడు. దానితో ఎన్టీఆర్ కి ఈ మూవీ కథను వినిపించారట. కాకపోతే ఎన్టీఆర్ కూడా ఆ సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. ఆ తర్వాత చేసేదేమీ లేక ఈ మూవీ స్టోరీ ని నితిన్ కి చెప్పడం , ఆయన ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ ఇవ్వడం జరిగిందట. ఆ తర్వాత దిల్ అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. నితిన్ కి ఈ సినిమా సూపర్ క్రేజ్ ను తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: