మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు నెలల్లో వీలు కాకపోతే కనీసం ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో అయినా విడుదల చేయాలి అని మేకర్స్ గట్టి పట్టుతో ఉన్నట్లు తెలుస్తోంది.

మూవీ షూటింగ్ పూర్తి కాగానే చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి.

మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ , చరణ్ కి జోడిగా కనిపించనుండగా ... శివరాజ్ కుమార్మూవీ లో ఒంకిలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండగా ... వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా మదర్ సెంటిమెంట్ ప్రధానంగా రూపొందిపోతున్నట్లు , అందుకోసం చరణ్ తల్లి పాత్రలో ఈ మూవీ లో విజయశాంతి ని తీసుకోవాలి అని మేకర్స్ అనుకుంటున్నట్లు , అందులో భాగంగా ఈమెకు మరికొన్ని రోజుల్లోనే కలిసి కథను వినిపించనున్నట్లు , ఈమెకు గనుక కథ నచ్చి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆర్ సి 16 మూవీ లో రామ్ చరణ్ కు తల్లి పాత్రలో విజయశాంతి కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: