పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ ని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ కొంత భాగం ఇప్పటికే పూర్తి అయ్యింది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ ల షెడ్యూల్ విడుదల అయింది. దానితో జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయ పనులతో ఫుల్ బిజీ అయ్యారు. దానితో ఈ సినిమా షూటింగ్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు.

దాదాపు రెండు , మూడు నెలల నుండి రాజకీయ పనులతో ఫుల్ బిజీగా సమయాన్ని గడిపిన పవన్ ప్రస్తుతం కూడా రిజల్ట్ వచ్చే వరకు ఏ సినిమాపై ఫోకస్ పెట్టే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. జూన్ 4 వ తేదీన రిజల్ట్ రానుంది. అందులో పవన్ కళ్యాణ్ గెలిచినట్లు అయితే మరికొన్ని రోజుల పాటు కూడా ప్రజాసేవలోనే నిమగ్నం కాబోతున్నట్లు తెలుస్తోంది.

అదే కానీ జరిగితే ఓజి సినిమా షూటింగ్ మళ్లీ రీ స్టార్ట్ కావడానికి దాదాపు రెండు , మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ సినిమా విడుదలకు కూడా ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంది. దానితో ఈ సినిమా మిగిలి ఉన్న బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి కావడం కష్టం దాని వల్ల ఈ సినిమాను ఆల్మోస్ట్ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కావడం కష్టం అని చాలా మంది అనుకుంటున్నారు.

మరి అలా కాకుండా పవన్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసి త్వరగా తన పోర్షన్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: