బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రెగ్నెంట్ అంటూ పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఈ బ్యూటీ స్పందించి అధికారికంగా తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నట్లు..
సెప్టెంబర్‌లో బిడ్డను కనబోతున్నట్లు ప్రకటించింది. ఇక అప్పటి నుంచి ఎక్కువగా కనిపించడం లేదు. ఇటీవల ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొనడంతో అంతా ఆమెపై ప్రశంసలు కురిపించారు. తొలిసారి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 'రామ్ లీలా(2013) సినిమాలో దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లు కలిసి నటించారు. ఇక ఈ సినిమా టైమ్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సినిమా అనంతరం బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాల్లో కలిసి నటించగా.. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక రామ్ లీలా సినిమాతో మొదలైన స్నేహం, ప్రేమ చివరకు ఏడు అడుగుల బంధంగా మారింది. 2018 నవంబర్ 14న ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక పెళ్లైన 6 ఏండ్ల తర్వాత ఈఏడాది ఫిబ్రవరిలో వీరు తల్లిదండ్రులు కాబోతున్నామంటూ గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నారు. సెప్టెంబర్‌లో డెలివరీ కాబోతున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీపిక తొలిసారి బేబీ బంప్‌ తో కనిపించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌ సందర్భంగా భర్తతో కలిసి ముంబైలోని పోలింగ్‌ స్టేషన్‌ వద్ద దర్శనమిచ్చారు. రణ్‌వీర్‌ – దీపిక ఇద్దరూ వైట్‌ డ్రెస్సుల్లో పోలింగ్‌ కేంద్రం వద్ద 

మెరిశారు. ఈ సందర్భంగా రణ్‌వీర్‌.. దీపిక చేయి పట్టుకుని పోలింగ్‌ బూత్‌లోకి తీసుకెళ్లి ఓటు వేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

 ఈ క్రమంలో… దీపికా పదుకొణె బేబీ బంప్‌తో నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బయటకు వచ్చిన వీడియో వైరల్ అవుతోంది. అది కూడా ఓటు వేయడానికి రావడంతో అంతా ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏకంగా ఆరు రాష్ట్రాల్లో మొత్తం 49 నియోజకవర్గాల్లో మే 20న ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. దీపికా ప్రతిష్టాత్మక మూవీ కల్కి 2898ADలో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. 27 జూన్ 2024న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: