బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది.  ధడక్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె దాని తర్వాత వరుస  సినిమాలు చేస్తూ బిజీగా మారింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ మెప్పిస్తుంది ఈ చిన్నది. అయితే సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ను

 ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుల మతి పోగొడుతుంది. అంతేకాదు ఒక రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్గా తన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది జాన్వి కపూర్. చిన్నప్పుడే తన ఫోటోలను పోర్న్ సైట్స్ లో పెట్టారు అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఇకపోతే జాన్వి కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలో

 నటిస్తోంది. ఇక ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నటుడు రాజ్ కుమార్ తో కలిసి నటిస్తోంది జాన్వి. కాగా ఇటీవల కరణ్ జోహార్ తో ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఆమె. ఇందులో భాగంగానే తను మాట్లాడుతూ.. 'నేను చాలా ఏళ్లుగా ఇది చూస్తున్నాను. సోషల్ మీడియా నన్ను చెడుగా చూపించింది. నేను మొదటిసారి 13 ఏళ్ల అమ్మాయిగా ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగింది. మా తల్లిదండ్రులతో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. ఆ సందర్భంగా తీసిన నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ' అని జాన్వీ కపూర్‌ తెలిపారు. 'సోషల్ మీడియా లేదా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే బాగుండేది కానీ కొంతమంది నా ఫోటోలను అశ్లీల వెబ్‌సైట్ లో పోస్ట్ చేశారు. మా స్కూల్లో అబ్బాయిలు ఆ ఫోటోలు చూసి నవ్వుకునేవారు. అంటూ తెలిపింది జాన్వి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: