![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestylec5547d12-05b5-4499-b06e-c65aab593d58-415x250.jpg)
అంతేకాదు ఐటెమ్స్ సాంగ్స్ గురించి చెబుతూ, తాను కూడా గుడ్ డాన్సర్‌ని అని, ఐటెమ్ సాంగ్స్ కూడా చేస్తానని, సాంగ్ బాగా నచ్చి, బాగా పర్‌ఫెర్మ్ చేసే యాక్టర్ పక్కన డాన్స్ చేయమంటే తాను చేయడానికి సిద్ధమే అని, దర్శకులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఆఫర్లు ఇవ్వాలని ఆమె వెల్లడించింది. తాజాగా ఈ వీడియో క్లిప్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.కామాక్షి భాస్కర్ల పొలిమేర చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పొలిమేర 2`లో మరింతగా పాపులర్ అయ్యింది. అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతోపాటు `సైతాన్ వెబ్ సిరీస్‌లో బోల్డ్ గా నటించి దుమ్మురేపింది. ప్రియురాలు సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కామాక్షి భాస్కర్ల. విరూపాక్ష, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్, రౌడీ బాయ్స్ తో పాటు ఇటీవల రిలీజైన `ఓం భీమ్ బుష్`లో ఇంపార్టెంట్ రోల్స్ చేసింది. ఇప్పుడు `దూత2`లోనూ మెరబోతుంది.స్వతహాగా డాక్టర్ అయిన కామాక్షి భాస్కర్ల యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టింది. వెండితెరపై ఎలాంటి పాత్రల్లో అయినా నటించి రక్తికట్టిస్తుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో గ్లామర్ విస్పోటనంతో ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె బెడ్ సీన్లు అయినా, న్యూడ్‌గా అయినా, ఐటెమ్స్ సాంగ్స్ అయినా చేసేందుకు రెడీ అని చెప్పడం విశేషం.