మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా  పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోలు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు కూడా వరుసగా ఫ్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా విరిద్దరి మధ్య విభేదాలు జరుగుతున్నాయి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతే కాదు రాజమౌళి సినిమా షూటింగ్ నుండి వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి అన్న ప్రచారం కూడా చేశారు. అర్ అర్ అర్  సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కాస్త తక్కువ

 చేశారు అని రామ్ చరణ్ క్యారెక్టర్ ను హైలెట్ చేశారు అని అందుకే రామ్ చరణ్ కి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చింది అని ఎన్టీఆర్ కి ఆ స్థాయిలో గుర్తింపు లభించలేదు అని వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్ చేసిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఈ విషయంపై అటు జూనియర్ ఎన్టీఆర్ గానీ ఇటు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కానీ ఎప్పుడూ స్పందించింది లేదు. అయితే తాజాగా ఏ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ

 సందర్భంగా రామ్ చరణ్ తన సోషల్ మీడియా వేదికగా "హ్యాపీ బర్త్డే టు మై డియరెస్ట్ తారక్" అంటూ ఒక పోస్ట్ షేర్ చేశాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు అని ఇంకా వీరిద్దరి మధ్య స్నేహబంధం అలాగే కొనసాగుతుంది అని క్లారిటీ వచ్చింది. మొత్తానికి ఒకే ఇండస్ట్రీకి చెంది ఇద్దరు కూడా ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతో వీరిద్దరి అభిమానులు ఒకింత చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ గేమ్ చెంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కూడా కానుంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో మరొక సినిమా కమిట్ అయ్యాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కూడా విడుదల అయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: