టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా నందమూరి ఫ్యామిలీకి ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినీ ఇండస్ట్రీలో ఉన్న అన్ని ఫ్యామిలీలలో ఈ రెండు ఫ్యామిలీలకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అని చెప్పొచ్చు. అంతేకాదు ఈ రెండు కుటుంబాల నుండే ఎక్కువ హీరోలు కూడా సిని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా కమర్షియల్ గా ఎంతటి

 విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా నుండి జూనియర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు కూడా ప్రస్తుతం వరుసగా ఫ్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు అందరూ ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం జూనియర్ ఎన్టీఆర్కి

 పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్లో చాలా ఏళ్లు వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేశారు. అందుకే వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం మరింత బలపడింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కి రామ్ చరణ్ లోని కొన్ని విషయాలు అంటే చాలా ఇష్టం అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అవేంటంటే ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడతాడట రామ్ చరణ్. ఏదైనా చేయాలి అనుకుంటే కచ్చితంగా అనుకున్న సమయానికి చేసేస్తాడట. దాంతోపాటు తన తోటి వారిని కూడా బాగా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు అని ఎన్టీఆర్ రామ్ చరణ్ లోని తనకు నచ్చిన క్వాలిటీస్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య ఎంతటి స్నేహం ఉందో ఈ విషయం చూస్తేనే అర్థమవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: