టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంతకి ఉన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన ఆడి పాడింది ఈమే. ఇకపోతే సమంత సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో సమంత ఏ పోస్ట్ చేసినా కూడా అది ఇట్టే జనాల్లోకి వెళ్ళిపోతోంది. అయితే ఇటీవల సమంత ఒక పోస్ట్ షేర్ చేసింది. నాగచైతన్యతో విడాకుల

 తర్వాత విడాకుల ముందు వాళ్ళిద్దరూ కలిసి నిర్మించుకున్న ఇల్లును ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేసి ఆ ఇంట్లోనే ఉంటున్నట్లు గా సమంత ఇటీవల తెలిపింది. ఇందులో భాగంగానే ఆ ఇంట్లో సమంత ఒక్కతే ఉంటే ఏం చేస్తుంది అన్న విషయాన్ని తాజాగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.. అదేంటంటే సమంత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తన పెట్ డాగ్స్ తో కలిసి టైం స్పెండ్ చేస్తుందట.  ఎప్పుడు తన పెట్ డాగ్స్ తోనే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా అదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా

 తెలిపింది సమంత. వాటికి సంబంధించిన ఫోటోలను తాజాగా షేర్ చేసింది. నా పెట్ డాగ్స్ ఇవి.. ఎప్పటికీ నన్ను అంటిపెట్టుకొని ఉంటాయి.. నా డార్లింగ్స్ ఇవి అంటూ ఆ ఫోటోల కింద ఒక క్యాప్షన్ కూడా జోడించింది సమంత. అలా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత ఎటువంటి సినిమాలు చేయడం లేదు. మయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న సమంత మళ్ళి సినిమాలతో బిజీ కావాలని చూస్తుంది. ఇప్పుడిప్పుడే మాయోసైటిస్ నుండి కోలుకుంటుంది. ఈ క్రమంలోనే గత ఏడాది ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సమంత దాంతోపాటు సిటాడేల్ అనే వెబ్ సిరీస్ ని కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం సినిమాలేవి చెయ్యకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులతో టచ్ లో ఉంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: